గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కూచిపూడిలో భారీ ఎత్తున నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అమర్తలూరు మండలం కూచిపూడి శ్రీ వసుంధర రైస్ మిల్లులో సుమారుగా పది లక్షల రూపాయలు విలువచేసే బియ్యాన్ని పట్టుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పాపారావు తెలిపారు.
ఇదీ చూడండి: