గుంటూరు జిల్లాలో ఈరోజు కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల నమోదు ప్రారంభమైన తర్వాత ఇవాళే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో కేసులు రావటం అధికారులను ఆందోళనకు గురి చేసింది.
కొత్తగా వచ్చిన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 105 ఉన్నాయి. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారిలో 16 మందికి పాజిటివ్ రాగా... గుంటూరు గ్రామీణ మండలంలో 1 కేసు నమోదైంది. మిగతా ప్రాంతాల వారీగా చూస్తే తాడేపల్లి 22, మంగళగిరి 11, పిడుగురాళ్ల 7,తాడికొండ 3 కేసులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
పెదనందిపాడు, చిలకలూరిపేట మండలాల్లో 2 చొప్పున, కొల్లూరు, మేడికొండూరు, పెదకాకాని, పొన్నూరు, పత్తిపాడు, తుళ్లూరు, సత్తెనపల్లి మండలాల్లో 1 కేసు చొప్పున నమోదైనట్లు వివరించారు. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.
ఇదీ చూడండి