ETV Bharat / state

'కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ తప్పనిసరి' - live updates of corona virus in andhrapradesh

కరోనాపై సమరానికి అన్ని వర్గాలు సమాయత్తం కావాలని... విశ్రాంత వైద్యులు, వైద్య సిబ్బంది తమ సహకారం అందించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కోరారు. త్వరలో కలెక్టరేట్​లో కరోనా వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

guntur dst collector press meet on corona virus
కరోనాపై తీసుకున్న చర్యలు చెపుతున్న కలెక్టర్‌
author img

By

Published : Mar 29, 2020, 3:32 PM IST

కరోనా నివారణకు తీసుకున్న చర్యలు వివరిస్తున్న కలెక్టర్‌

వైరస్ నివారణ, నియంత్రణకు గుంటూరు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని కలెక్టర్ శ్యాముల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ప్రజల సహకారం కీలకమని చెప్పారు. గుంటూరు జిల్లాలో మరో 2 పాజిటివ్ కేసులు వచ్చాయని.. మరో 2 అనుమానిత కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని... స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైద్య సిబ్బందిని అడ్డుకుంటున్నారని వార్తలు వచ్చాయని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐడీ ఆస్పత్రిలో మరో 10 బెడ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

ఇదీ చూడండి:

'కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.