గుంటూరు జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో కరోనా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. రేపల్లె నియోజకవర్గం గ్రీన్ జోన్లో ఉన్న కారణంగా.. అదే పరిస్థితిని ఇక మీదట కూడా కొనసాగించేలా కసరత్తు చేస్తున్నారు. ఎవరూ వైరస్ బారిన పడకుండా ఉండేలా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నారు.
అత్యవసర వాహనాలను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అనవసరంగా బయట తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలంతా సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.
ఇవీ చదవండి: