గుంటూరు జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 32 మంది నిన్న మంగళగిరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ నయమైన వారితో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మాట్లాడారు. ఇంటికి వెళ్లాక 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని నిర్దేశించారు. కుటుంబ సభ్యులతోనూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైద్యుల సలహాలు తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా డిశ్చార్జ్ అయిన 32 మందిలో నరసరావుపేటకు చెందిన వారు 20, గుంటూరు నగరానికి చెందిన వారు 11 మంది, పొన్నూరుకు చెందిన వారు ఒకరున్నారు. వీరిని ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు.
ఇవీ చూడండి...