ప్రతిష్ఠాత్మక గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నామని.. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతోన్న ఇబ్బందుల్ని అధిగమిస్తామని.. రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
గుంటూరులో మాట్లాడుతూ.. పరిహారం పెంపు విషయమై ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే శంకరరావు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. 2 జిల్లాలు సస్యశ్యామలమయ్యే ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కొవిడ్ వ్యాప్తి కారణంగానే స్థానిక ఎన్నికలను ప్రస్తుతం నిర్వహించవద్దంటున్నామని... ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికలకు వెళ్లడం అవసరమా? అంటూ ప్రశ్నించారు.
ఇవీ చదవండి..