కరోనాతో మృతిచెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని గుంటూరు జిల్లా జడ్జి జి. గోపిచంద్ అన్నారు. ప్రజలు లేనిపోని భయాలతో చనిపోయిన వారి అంత్యక్రియలను అడ్డుకోకూడదని సూచించారు. మరణించిన వారికి అంత్యక్రియలు చేయడం వారి హక్కు అని.. వాటిని ఎవరూ అడ్డుకోకూడదని అన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి..