మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి గుంటూరు జీజీహెచ్లో వైద్యం నిరాకరించటంపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పందించారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు. దీంతో జీజీహెచ్ అధికారులు... మూత్రపిండాల వ్యాధి బాధితుడు బాలాజీ నాయక్ ను గుంటూరు పిలిపించి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అతనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్ లో కోవిడ్ రోగులు ఎక్కువగా ఉన్నందున బాలాజీ నాయక్ ను అధికారులు చేర్చుకోలేదు. దీంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయం ఈటీవీ-భారత్, ఈనాడు దృష్టికి వచ్చింది. టీవీ, పత్రికలో వచ్చిన కథనాలు రావడం వల్ల అధికారులు స్పందించి బాలాజీ నాయక్ ని ఆసుపత్రిలో చేర్చుకున్నారు.
ఇదీ చూడండి. అధికారిక లాంఛనాలతో పెన్మత్స అంత్యక్రియలు