గుంటూరు నాయుడుపేటలో ఏర్పాటవుతున్న విద్యుత్ తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్ జనరేటర్ ప్లాంట్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు ఆలస్యమవటానికి గల కారణాలను సంస్థ ప్రతినిధిలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు, ఏడు పురపాలికల్లో పోగయ్యే చెత్తను ఇక్కడకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. జిందాల్ సంస్థ 15మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. అనంతరం జేకేసీ కళాశాల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్, కమిషనర్ పరిశీలించారు.
ఇదీచదవండి.