ETV Bharat / state

కలెక్టర్ సమావేశానికే ఉద్యోగులు ఆలస్యం...! - guntur

గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి కొందరు అధికారులు ఆలస్యంగా రావటంపై...వారందరికి ఛార్జ్ మెమోలు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు.

అధికారులపై ఆగ్రహించిన కలెక్టర్
author img

By

Published : Aug 29, 2019, 6:51 AM IST

అధికారులపై ఆగ్రహించిన కలెక్టర్

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి కొందరు అధికారులు, ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక సమావేశానికి నిర్ణీత సమయానికంటే 20 నిమిషాలు ఉద్యోగులు ఆలస్యంగా రావడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఉద్యోగులు ప్రజల సేవకులన్న మాట మర్చిపోవద్దని.... విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. ఆలస్యంగా వచ్చిన వారందరిని గైర్హాజరుగా నమోదు చేసి ఛార్జ్ మెమోలు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. సమావేశం అనంతరం ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులు వెళ్లి తమ ఆలస్యానికి కారణాలు వివరించే ప్రయత్నం చేయగా...ఆయన తిరస్కరించారు.

ఇదీ చూడండి: 'జాతీయ గీతం పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి'

Intro:AP_VSP_57_28_RED ALERT IN AOB_AV_AP10153Body:ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌తో సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు మృత్యవాత చెందగా, ఒక మావోయిస్టు నేత మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మావోయిస్టు ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీలో ప్లాటూన్‌ సబ్యునిగా వ్యవహరిస్తున్న రాకేష్‌సోధిగా పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏఓబీ జోనల్‌ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ నేతృత్వంలో ఏవోబీ ప్రత్యేక బృందం తప్పించుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బొండాఘాట్‌లో అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలు నుంచి సమాచారం రావడంతో ఈ మేరకు పెద్ద ఎత్తున డీవీఎఫ్‌ మరియు ఎస్‌వోజీ బలగాలతో గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. చాలా కాలం తరువాత ఏవోబీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు మృత్యవాత చెందారు. 2016లో జరిగిన రామ్‌గుడా ఎన్‌కౌంటర్‌ తరువాత పోలీసులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున పోలీసులపై దాడులు చేయడానికి రూపకల్పన చేశారు. అయితే ఈ విషయాని్న ముందుగానే పసిగట్టిన పోలీసు వర్గాలు ఆచీతూచీ అడుగువేయసాగారు. ఈ క్రమంలో గత ఏడాది అరకులో జరిగిన కిడారి, సోమ హత్యలు జరిగాయి. ఈ సంఘటన జరిగిన తరువాత పోలీసులు దూకుడు పెంచారు. ఒక్కసారిగా ఆంధ్రా-ఒడిశా పోలీసులు సంయుక్త కార్యచరణ తో ఏడాదిలో సుమారు 11 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. తాజాగా జరిగిన సంఘటనలో ఇరువైపులా నష్టం జరగడంతో ప్రతీకారం కోసం తమ కదలికలను ముమ్మరం చేశారు. తప్పించుకున్న మావోయిస్టలు ఆంద్రాలోకి ప్రవేశించే అవకాశముందని నిఘా వర్గాలు తెలపడంతో విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. అధనపు బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్‌ మరియు ప్రత్యేక పార్టీ బలగాలతో గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు. Conclusion:M RAMANARAO,SILERU AP10153
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.