పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తితో నడిచే సైకిల్‌ను గుంటూరు జిల్లా బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ముప్పా లక్ష్మణరావుతో కలిసి అధ్యాపకులు రూపొందించారు. సైకిల్ పైభాగంలో 15 వాట్స్ సామర్థ్యం కలిగిన రెండు సౌర ప్యానెళ్లకు 14 ఏహెచ్ మోటార్, 18 వోల్టుల సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలు అనుసంధానం చేశారు.
సౌరశక్తిని ప్యానళ్లు విద్యుత్తుగా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తాయి. బ్యాటరీ ద్వారా మోటార్ పనిచేసి సైకిల్ నడుస్తుంది. దీని తయారీకి 20 రోజులు పట్టిందని, 4 గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే సైకిల్ 20 కిలోమీటర్ల వేగంతో గంట ప్రయాణిస్తుందని ప్రిన్సిపల్ తెలిపారు. సైకిల్‌కు అనుసంధానించే పరికరాల తయారీకి రూ.15 వేలు ఖర్చవుతుందని చెప్పారు.
ఇదీ చదవండి:
CHANDRABABU: ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న తెదేపా అధినేత