గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తిలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 194 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 70,790కు చేరింది. ఇప్పటివరకు 67,685 మంది మహమ్మారిని జయించి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. ఇవాళ గుంటూరులో 44 కేసులు నమోదుకాగా.. మంగళగిరిలో 17, కొల్లిపరలో 13, తాడేపల్లిలో 13, పిడుగురాళ్లలో 12, తెనాలిలో 11 మంది చొప్పున కరోనా బారిన పడ్డారు.
వైరస్‌తో ఒకరు మృతి చెందారు. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 637కు చేరిందని వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: