ETV Bharat / state

కలెక్టర్ చొరవ.. నిరుపేద కుటుంబానికి రేషన్, ఉపాధి - guntur collector latest news

ఆ దంపతులది నిరుపేద కుటుంబం.. అద్దె ఇంట్లో ఉంటూ చిత్తుకాగితాలు ఏరుతూ.. కూలికి వెళుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి దుర్భర పరిస్థితులను చూసి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. వారికి రేషన్ కార్డుతో పాటు.. ఆ కుటుంబ పెద్దకు పారిశుద్ధ్య కార్మికుడిగా ఉపాధి కల్పించారు. వారికి జగనన్న ఇంటి పథకానికి దరఖాస్తు చేయించాలని అధికారులకు సూచించారు.

guntur collector vivek yadav helps to poor

author img

By

Published : Jul 2, 2021, 7:54 AM IST

గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. వారికి ఆపన్న హస్తం అందించారు. గుంటూరుకు చెందిన రౌతు నాగరాజు చిత్తుకాగితాలు ఏరుతూ.. కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుటుంబం ఏ.టి.అగ్రహారం శివారులోని అద్దె ఇంట్లో ఉంటోంది. వారికి పూట గడవడం కూడా కష్టంగా మారింది. వారు అనుభవిస్తున్న బాధలు గురించి పత్రికలో కథనం రాగా ఆ కుటుంబ దుర్భర స్థితిని చూసి కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. వారికి సంక్షేమ పథకాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు.

నగరంలోని 52వ సచివాలయం పరిధిలో వారికి ఆధార్ నమోదు చేయించి, అనంతరం బియ్యం కార్డును ఇప్పించారు. వారిని నేరుగా ఛాంబర్​కి పిలిపించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ పెద్ద గౌతు నాగరాజుకు నగరపాలక సంస్థలో ఒప్పంద పద్ధతిన పారిశుద్ధ్య కార్మికునిగా ఉపాధి కల్పించారు. పిల్లలను చక్కగా చూసుకోవాలని..వారిని అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పేదలందిరికీ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేయించాలని సచివాలయం ఉద్యోగులకు సూచించారు.

ఇదీ చదవండి:SANGAM: సంగం డెయిరీ కేసులో తీర్పు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.