గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో మౌలిక వసతుల కల్పనను.. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పరిశీలించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర సౌకర్యాలను.. ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. జాతీయ రహదారి వరకు నిర్మించే ప్రధాన రహదారి పనులను.. అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎయిమ్స్ సీఈవో డాక్టర్ ముఖేష్ త్రిపాఠితో.. కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు.
ప్రభుత్వ ఒప్పందం మేరకు సంస్థకు ఇంకా పది ఎకరాలు అప్పగించాల్సి ఉన్నట్లు.. ఎయిమ్స్ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 183 ఎకరాలు ఇవ్వగా.. మరో 10 ఎకరాలను వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు. ఎయిమ్స్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేయాలని మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని రెడ్డిని శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. ప్రధాన రహదారి మార్గంలో ఆర్చ్ నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి: