ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యసేవలపై ప్రత్యేక నిఘా పెట్టామని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. వైద్యచికిత్సలకు నిర్ణీత రుసుం కంటే ఎక్కువగా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి ఆసుపత్రులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు నిర్దిష్ట సమాచారంతో ముందుకు రావాలని కోరారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై జేసీ ప్రశాంతితో కలసి సమావేశం ఏర్పాటు చేసిన ఆయన...జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందన్నారు. గతంలో 13శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 7.12 శాతానికి తగ్గిందన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం బెడ్లు ఆరోగ్యశ్రీ కార్డుదారులకు కేటాయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా కరోనా వైద్యచికిత్సలను అందిస్తున్న రెండు ప్రైవేటు ఆసుపత్రులపై ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. మరో ఆసుపత్రికి నోటీసులు ఇచ్చామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీచదవండి