కొత్త జిల్లాల ఏర్పాటుపై గుంటూరులో జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ, ఆర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. సరిహద్దుల గుర్తింపుతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు గుర్తించాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుతమున్న కార్యాలయాల్లో పక్కా భవనాలున్నవి, అద్దె భవనాల్లో ఎన్ని కొనసాగుతున్నాయనే విషయమై శాఖల వారీగా వివరాలు సేకరించాలన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో వివిధ శాఖల ఫైళ్లను ఆ మేరకు విభజించాల్సి ఉంటుందన్నారు. కొత్త జిల్లాలో కార్యాలయాల నిర్వహణకు వస్తు సామగ్రి, కంప్యూటర్లు, స్కానర్లు, బీరువాలు, టేబుళ్లు, కుర్చీలు వంటివి సమకూర్చుకోవాల్సి ఉన్నందున...వాటి వివరాలను క్రోడీకరించాల్సి ఉందన్నారు. ఈ సమావేశం సందర్భంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఒకటి, మూడో కమిటీలకు రెవెన్యూ, రైతు భరోసా జేసీ దినేశ్ కుమార్ ఛైర్మన్గా, రెండో కమిటీకి సచివాలయాలు, అభివృద్ధి జేసీ, నాల్గొవ సబ్ కమిటీకి జిల్లా రెవెన్యూ అధికారి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.
ఇదీచదవండి