TSPSC announced Group-4 Exam Date: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష తేదీ వచ్చేసింది. గ్రూప్-4 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1; మధ్యాహ్నం 2.30 గంల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా వివిధ శాఖల్లో భర్తీ చేసే 8,180 గ్రూప్- 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇవ్వగా.. భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆఖరి గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగిస్తూ ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30 వరకు 8,47,277 మంది అప్లై చేసుకోగా.. దరఖాస్తు గడువు పెంచడంతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: