గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేట వద్ద గొర్రెల మంద పైకి కంకర లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 23 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ నుంచి తెనాలికి గొర్రెల మందను తోలుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గొర్రెల కాపరులు వివరించారు. ఈ ప్రమాదంలో ఆరులక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వారు వాపోతున్నారు. లారీ డ్రైవర్ని పట్టుకున్న గొర్రెల కాపరులు.. తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండీ.. స్పెషల్ డ్రైవ్ : 90 ఎంఎల్ విస్కీ టెట్రా ప్యాక్‌లు స్వాధీనం