గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో అభం శుభం తెలియని 8 ఏళ్ళ చిన్నారిపై వరుసకు తాతయ్య అత్యాచారయత్నం చేశాడు. ఓ కుటుంబానికి దూరపు బంధువయ్యే వ్యక్తి... చుట్టం చూపుగా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుంటాడు. అలానే మంగళవారం బంధువుల ఇంటికిి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో... ఇంటి ముందు తోటి మిత్రులతో ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. నోట్లో గుడ్డలు పెట్టాడు... ఇంతలో చిన్నారి కుటుంబీకులు రావటంతో ఖంగు తిన్నాడు. ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారని స్థానికులు తెలిపారు.
ఈ విషయంపై చిన్నారి కుటుంబీకులను మేడికొండూరు సీఐ ఆనందరావు ప్రశ్నించగా.. అలాంటిది ఏమి జరగ లేదని... బంధువు మద్యం మత్తులో నోరు జారాడని వారు వివరించారు.
ఇదీ చదవండి: చింతకొమ్మదిన్నె ఘటనలో.. మిగిలిన చిన్నారి మృతి