గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. నేడు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఈ ప్రాంతాల్లో పర్యటించారు. మంగళగిరిలోని రత్నాల చెరువు, పెద్ద కోనేరు, పీఎంఏవై గృహసముదాయం, గాలిగోపురంతో పాటు తాడేపల్లిలోని ముఖ్య కూడళ్లను విజయ్ కుమార్ పరిశీలించారు.
ఈ రెండు పట్టణాలలో రహదారుల విస్తరణ, భూగర్భ డ్రైనేజ్, సుందరీకరణ, ఇతర మౌలిక వసతుల కోసం 15 వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరికి 800 కోట్లు, తాడేపల్లికి 700 కోట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదిలోపే ఈ రెండు మున్సిపాల్టీలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఇదీ చూడండి విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ నియామకం