ETV Bharat / state

వలస జీవులకు ఉపశమనం.. ఈ శిబిరాలు - వలస జీవులకు శిబిరాలు ఏర్పాటు న్యూస్

వలస కార్మికుల దయనీయ పరిస్థితులను గ్రహించిన ప్రభుత్వం.... వారిని ప్రణాళికాయుతంగా సొంతూళ్లకు పంపే ప్రక్రియను చేపట్టింది. రహదార్లపై నడిచివెళ్తున్న వలస కార్మికుల కష్టాలపై ఈనాడు-ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనాలపై స్పందించిన ప్రభుత్వం... వారికి భోజన సదుపాయాలు కల్పించి సేదతీర్చేందుకు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసింది. జాతీయ రహదారిపై 25 నుంచి 50 కిలోమీటర్ల చొప్పున ఏర్పాటు చేసిన శిబిరాలు... వలస కార్మికులకు కాస్త ఉపశమనమిస్తున్నాయి.

govt shelters for migrant workers
govt shelters for migrant workers
author img

By

Published : May 18, 2020, 5:01 AM IST

లాక్​డౌన్ వేళ.... వలస కార్మికుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి కరవై... సుదూర ప్రాంతాల్లోని సొంతూళ్లకు కాలినడకనే పిల్లాపాపలతో, మోయలేని భారంతో పయనమైన దయనీయ పరిస్థితులు అందరినీ కంటతడి పెట్టించాయి. మండే ఎండలు.... కాలే కడుపులతో.... వందలాది కిలోమీటర్ల మేర వారు సాగించిన పయనం...అంతులేని ఆవేదనను నింపింది. వీరి సమస్యను ఈటీవీ-ఈనాడు, ఈటీవీ భారత్​ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి... వారి ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చారు. స్పందించిన ప్రభుత్వం సమీక్ష నిర్వహించి వలసకూలీల సంక్షేమానికి చర్యలు చేపట్టింది.

నడిచి, సైకిళ్లు, ట్రక్కులపై వెళ్లకుండా వారిని ఆపి తాత్కాలికంగా శిబిరాలకు తరలించి ఉపశమనం కల్గిస్తున్నారు అధికారులు. జాతీయ రహదారిపై వారికి అర్థమయ్యే రీతిలో హిందీ, ఒరియా, బెంగాళీ, తమిళం, కన్నడ భాషల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వారికి వివరించి శిబిరాలకు తీసుకువచ్చి భోజనం, తాగునీరు అందిస్తున్నారు. ఒడిశాకు బస్సులపైన పంపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు శ్రామిక రైళ్ల ద్వారా వలస కార్మికులను పంపుతున్నారు. ఒక రైలులో 1600 మంది వరకు ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. రహదార్ల పక్కనే డాబాలు తెరిపించి అన్నపానీయాలు అందించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇన్నాళ్ల తమ సమస్యలను ఏకరువు పెడుతున్న వలస కార్మికులు.... ఎట్టకేలకు స్వస్థలాలకు పంపడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వలస కార్మికులను తాత్కాలిక శిబిరాలకు తీసుకువస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందుగా స్పందన యాప్​లో వారి పేర్లను నమోదు చేస్తున్నారు. అదే రోజు వారిని పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆయారాష్ట్రాలకు క్వారంటైన్ ఏర్పాట్ల నిమిత్తం వారి డేటాను పంపిస్తూ సమచారం అందిస్తున్నారు. తాత్కాలిక శిబిరాల నిర్వహణలో గ్రామ కార్యదర్శులు, వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నారు. ఎవరూ రహదారి వెంబడి నడిచి వెళ్లొద్దని... ప్రభుత్వమే వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తుందని చెబుతున్నారు అధికారులు.

ఇదీ చదవండి: శ్రామిక్ రైలు ప్రారంభించిన డీజీపీ సవాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.