U1 ZONE BEING LIFTED: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని 178 ఎకరాలలో ప్రభుత్వం విధించిన యూ1 జోన్ ఎత్తివేయాలంటూ గత 146 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు దీక్షలు విరమించారు. ఈ నెల మొదటి వారంలో యూ1జోన్ ఎత్తివేసేందుకు అనుకూలంగా రైతుల నుంచి ఏమైన అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజపత్రం విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో జోన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం రైతులకు సమాచారం ఇచ్చింది. దీనిపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం నిరసన దీక్షలను విరమించారు.
జోన్ ఎత్తేసేందుకు సీఎల్‌యూ, సిఫ్ పేరుతో 2 శాతాన్ని అదనపు పన్నుగా చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆగ్రహించిన రైతులు దీక్షలను కొనసాగించారు. పన్ను ఎత్తేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉద్దంటూ పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రావడంతో రైతులు దీక్షలను విరమించారు.
యూ-1 జోన్ అంటే..: గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి పరిధిలోని అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్‌గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్‌ను సైతం కలిశారు.
ఇవీ చదవండి: