ONE MAN COMMISSION : బెంతో ఒరియా, వాల్మీకి, బోయ సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషన్‌కు నేతృత్వం వహించనున్నారు. శామ్యూల్ ఆనంద్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కాంతీ లాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లోగా ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.
ఇవీ చదవండి: