అక్టోబరు 2 నుంచి దశలవారీ మద్య నిషేధం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడతలో 20 శాతం అమ్మకాలు తగ్గించేలా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోఉన్న 4వేల 377 మద్యం దుకాణాలను 3వేల 500లకు తగ్గించాలని నిర్ణయించింది. వీటిని బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలని భావిస్తోంది. అద్దెకు తీసుకుని నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. అద్దెకు ఇవ్వడానికి యజమానులు నిరాకరిస్తే... సమీపంలోనే మరో షాపు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి దుకాణంలోనూ ఓ సూపర్ వైజర్‌తో పాటు, ఇద్దరు సేల్స్‌మెన్లను నియమించుకోనుంది. ఈ నియామకాలను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని సంయుక్త కమిటీ నిర్వహించనుంది. సూపర్‌వైజర్ పోస్టుకు కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. బీకాం చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు. సేల్స్‌మెన్ ఉద్యోగానికి ఇంటర్ విద్యార్హతగా తేల్చారు. వాచ్ అండ్ వార్డ్ పోస్టులకు విద్యార్హతలు అవసరం లేదు. అభ్యర్థులు 2019 అక్టోబర్ నాటికి 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. మద్యం దుకాణం ఏర్పాటయ్యే మండలానికి చెందినవారే అక్కడ పని చేసేందుకు అర్హులు. సూపర్‌వైజర్‌కు నెలకు 17వేల 500, సేల్స్‌మెన్‌కు 15వేలు ఇస్తారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ఏడాది కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి నలుగురిని నియమిస్తారు.
మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు... అర్హతలేంటంటే? - మద్య నిషేధం
దశలవారీ మద్య నిషేధం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు విధి విధానాలు సిద్ధం చేస్తోంది. అక్టోబరు 2 నుంచే దశలవారీ మద్య నిషేధం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.