వినుకొండలో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్రంగా గాయపడి నరసరావుపేట ప్రయివేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వినుకొండ పట్టణ భాజాపా అధ్యక్షుడు రమేష్‌ను భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులే మేడం రమేష్‌పై దాడికి పురమాయించారని ఆరోపించారు.
దాడి చేసినవారిని గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయడంలో జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పి చొరవ తీసుకోవాలని కోరారు. కొన్ని మతాలకు ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ ని కాపాడే కొందరు పోలీస్ అధికారులను సక్రమంగా పనిచేయనీయడం లేదని ఆరోపించారు. "రాయచోటి లో వినాయక విగ్రహం పడగొడతాo అని కొందరు చెలరేగిపోయారు. వినుకొండ లో శివాలయాన్ని పడగొట్టకుండా అడ్డుతగిలాడనే మేడం రమేష్ పై దాడి చేశారు" అని సోము వీర్రాజు ఆరోపించారు.
'రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తం'
రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి లో ఉందని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఓ వివాహ కార్యక్రమంలో భాజపా ప్రధాన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మత రాజకీయాలు వైకాపా చేస్తూ.. భాజపా మతతత్వ పార్టీ అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 16 నుంచి కేంద్ర మంత్రులు ఆశీర్వాద యాత్ర లో పాల్గొంటారని చెప్పారు.
ఇదీ చదవండి: