SAJJALA ON BRS PARTY : రాష్ట్రంలో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని అడిగితే.. ఏం చేయాలనేది ఆలోచిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్పై తమ అభిప్రాయం తమకుందని.. స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు మద్దతుపై అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని వ్యాఖ్యనించారు. కర్ణాటక, తమిళనాడులో పోటీ చేసే ఆలోచన వైసీపీకి లేదని తేల్చిచెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ అంటే తెలంగాణలో చేసేవాళ్లం కదా అని ప్రశ్నించారు. విశాఖకు రాజధాని రాకుండా చేసేందుకే ఉద్యమకారులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.
భూముల రీసర్వేపై ప్రతిపక్షాల విమర్శలు సరికావు: భూసర్వేతో రెవెన్యూ శాఖలో సీఎం సంస్కరణలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగులపై ఒత్తిడి ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. భూముల రీ సర్వేపై ప్రతిపక్షాల విమర్శలు సరికావని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదని వివరించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు సహకరించాలని కోరారు.
సమైక్యం కోసం వైసీపీ తొలినుంచీ పోరాడుతోందని చెప్పినట్లు గుర్తుచేశారు. 8 ఏళ్లు దాటినా విభజనపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉందని.. తన వ్యాఖ్యలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదని.. స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: