కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని ఫిరంగిపురంలో పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు, కూరగాయలు, బియ్యం అందించారు. ప్రజలంతా వ్యక్తిగత దూరం పాటించాలని.. లాక్డౌన్ నిబంధనలను అనుసరించాలని సూచించారు. అనంతరం స్థానిక వైకాపా నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు.
ఇదీ చదవండి..