ETV Bharat / state

అమరావతిలో భూ సర్వేపై మంత్రుల సమీక్ష - సచివాలయంలో మంత్రుల సమావేశం

GOM Meet On Land Resurvey : ఈ ఏడాది చివరి నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలని మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో శాశ్వత భూ హక్కు భూ రక్ష పై సమావేశం అయిన మంత్రుల కమిటీ …...దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 9, 2023, 11:25 AM IST

GOM Meet On Land Resurvey : సచివాలయంలో శాశ్వత భూ హక్కు భూ రక్ష పై సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలని మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంత్రుల కమిటీ.. దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించింది.

జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచనలు ఇచ్చింది. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు.

ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్ డివిజన్ లలో సుమారు 2 లక్షల మ్యూటేషన్​లను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది మే నెల నాటికి 6వేల గ్రామాలు, ఆగస్టు నెల నాటికి 9వేల గ్రామాలు, అక్టోబర్ నాటికి 13వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం 17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు 5264 గ్రామాల్లో డ్రోన్ ద్వారా చిత్రాలను రికార్డు చేసినట్టు అధికారులు వివరించారు.

జూన్ 2023 నాటికి 4006 గ్రామాలకు ఓఆర్ఐ మ్యాప్ లను సిద్దం చేస్తునట్టు స్పష్టం చేశారు. 3191 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 2464 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశారని.. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ సూచించింది. సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అలాగే భూయజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో విచారణ చేసి పరిష్కరించాలని సూచనలు ఇచ్చారు. సర్వే కోసం 30 అత్యాధునిక డ్రోన్లు, 70 బేస్ స్టేషన్లు, 1330 జిఎన్ఎస్ఎస్ రోవర్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.