గుంటూరు నగరపాలెంకు చెందిన కరణం రాంకుమార్... రేషన్ డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూవారీ విధుల్లో భాగంగా తన భార్యతో కలిసి రేషన్ షాపుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా... ఇంట్లోని సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చి బీరువా తెరిచి చూడగా బంగారు ఆభరణాలు, రూ.పది వేలు నగదు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.