కృష్ణమ్మ వరద ఉద్ధృతితో గుంటూరు జిల్లా పులిచింతల జలాశయం నిండిపోవడంతో, చాలా ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. కంచుబొడ్డు తండాకు చెందిన 50 ఆవులు పులిచింతల బ్యాక్ వాటర్ ఉన్న అటవీ ప్రాంతంలో నెలరోజుల క్రితం మేతకు వెళ్లాయి. ఈలోగా వరద ఉద్ధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయాయి. సరైన ఆహారం లేక, అనారోగ్యంతో 20 వరకు ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 30 ఆవులు బక్కచిక్కి మృత్యువుతో పోరాడుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టులో చేపలు పెట్టేవారు ఆవులను గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. వాటిని బయటకు తీసుకురావలంటే లాంచీ, పడవల ద్వారా తప్పమరో మార్గం కనిపించక వాటి యాజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీచదవండి