ETV Bharat / state

బాలిక నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరింపులు.. యువకుడు అరెస్ట్ - andhra pradesh news updates

బాలికను వంచించాడు. వేధించాడు. ఆ బాలిక అక్కను మోసగించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ నమ్మకద్రోహం చేశాడు. ఆ దుర్మార్గుడి మోసం ఆలస్యంగా బయటికి వచ్చింది. చివరికి అతడి జీవితం జైలు పాలైంది. ఈ ఘటన.. గుంటూరు జిల్లా పరిధిలో జరిగింది.

crime
crime
author img

By

Published : Jul 19, 2021, 8:31 AM IST

బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. నగ్న వీడియోలు, ఫొటోలు తీశాడు. చివరికి... బ్లాక్‌మెయిల్‌ చేసి బంగారు వస్తువులు, రూ.లక్షలు వసూలు చేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమె సోదరితో ప్రేమాయణం నడిపి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఆ నయవంచకుడిని గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్పీ ప్రశాంతి తెలిపిన వివరాల మేరకు.. చేబ్రోలుకు చెందిన వేములపల్లి జోషిబాబు ఇంజినీరింగ్‌ చదివి పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చిలకలూరిపేటకు చెందిన బాలిక 2019లో వేసవి సెలవులకు చేబ్రోలులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో జోషిబాబు ఆమె వెంటపడ్డాడు. ఫోన్‌ నంబరు ఇవ్వకపోతే యాసిడ్‌ పోస్తానని, అమ్మమ్మను చంపేస్తానని బెదిరించాడు. తరవాత అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో కాల్‌ చేసి ఆమెతో నగ్నంగా మాట్లాడించాడు.

డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి బంగారు గొలుసు తీసుకున్నాడు. ఆమె తండ్రికి ఫోన్‌ చేసి బాలిక నగ్నవీడియోలు, ఫొటోలు వేరేవారి దగ్గర చూశానని, వాటిని తొలగించాలంటే ఖర్చవుతుందంటూ రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. వాటిని డిలీట్‌ చేయిస్తానంటూ ఆమె సోదరి నుంచి బంగారుగొలుసు కాజేశాడు. తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమాయణం నడిపాడు. ఈ నెల 13న రహస్యంగా తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మధుసూదనరావు, ఎస్సై కోటేశ్వరరావు శనివారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అతని వద్ద రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.