ETV Bharat / state

'ప్రయాణం వల్లే అచ్చెన్నకు గాయం పెరిగింది' - అచ్చెన్నాయుడికి చికిత్స వార్తలు

ggh-superintendent-respond-on-atchannaidu-health

author img

By

Published : Jun 13, 2020, 11:41 AM IST

Updated : Jun 13, 2020, 12:22 PM IST

11:36 June 13

ఈటీవీ భారత్​తో జీజీహెచ్ సూపరింటెండెంట్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ స్పందించారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈ నెల 11న అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగిందని... మరుసటి రోజే వాహనంలో ఎక్కువసేపు ప్రయాణించటం వల్ల గాయం కాస్త పెరిగిందని ఆయన వెల్లడించారు. 2, 3 రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్‌ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావచ్చని చెప్పారు. 99 శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ అభిప్రాయపడ్డారు. 

అచ్చెన్నాయుడు మూల వ్యాధి సంబంధిత ‘పెరీయానల్‌ ఆబ్సెస్‌’తో బాధపడుతున్నారు. ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు ప్యాడ్‌ వేసి ఆ రోజు రాత్రి ఇంటికి పంపించారు. 12న ఉదయం ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

ఇదీ చదవండి

ఈఎస్​ఐ కేసులో మరొకరు అరెస్ట్

Last Updated : Jun 13, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.