ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్​లో సాధారణ వైద్య సేవల నిలిపివేత - గుంటూరు జీజీహెచ్‌లో కరోనా చికిత్స

గుంటూరు జీజీహెచ్​లో అత్యవసర శస్త్రచికిత్సలు మినహా ఇతర సేవలను నిలిపివేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. కరోనా విస్తృతి కారణంగా పడకల సమస్య రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

general medical services stopped in guntur ggh
గుంటూరు జీజీహెచ్​లో సాధారణ వైద్య సేవల నిలిపివేత
author img

By

Published : Apr 11, 2021, 10:32 AM IST

కరోనా బాధితులకు పడకల సమస్యలు తలెత్తకుండా గుంటూరు జీజీహెచ్‌లో అత్యవసర వైద్య శస్త్రచికిత్సలు మినహా మిగిలిన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సాధారణ రోగులను పట్టించుకోవటం లేదంటూ... ఇటీవల కొందరు రోగులు ఆందోళన చేశారు.

ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర వైద్య, విద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది కొవిడ్‌ తీవ్రతతో ఒప్పంద వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని ఆరు నెలల కాలానికి నియమించుకున్నారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టాక వారిని తొలగించారు. ఫలితంగా సిబ్బంది కొరతతో సేవలు అందించడం సాధ్యపడకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీచదవండి.

దారుణం.. వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన ప్రత్యర్థులు

'పూలే స్ఫూర్తితో తెదేపా బీసీల అభ్యున్నతికి పాటుపడుతోంది'

టాలీవుడ్.. ఇచ్చట అన్ని రకాల కథలు దొరుకును!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.