గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన గాయత్రీ దేవి స్థూపాన్ని బుధవారం ప్రారంభించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు జరిపించారు.
ఇరవై నాలుగు పేర్లతో ఉన్న 24 అమ్మవారి రూపాలను స్థూపంపై నిక్షిప్తం చేయటం దాని విశిష్టతగా పేర్కొన్నారు. ఈ స్థూపంలో 24 లక్షల గాయత్రి దేవి ప్రతులను లోపలి భాగంలో పొందుపరిచామని ద్వారకామాయి ట్రస్ట్ ఛైర్మన్ సీహెచ్.విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: బద్వేల్లో సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు