గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైకాపా బాధితులు తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. తాము జైల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయ పోరాటంలో సహకరించిన తెదేపా లీగల్ సెల్‌కు కృతజ్ఞతలు చెప్పారు. మాచర్ల రూరల్ సీఐ తమను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలుకు వచ్చి మరీ, తమకు బెయిల్ రానివ్వనని, రికార్డు పంపించనని బెదిరించారని వాపోయారు. పల్నాడులో పరిస్థితి ఘోరంగా ఉందని, వైకాపా నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చంద్రబాబుకు తెలిపారు. తెదేపా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సమస్య వస్తే.. పార్టీ ఉందని భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: చిన్న రైతుకు పెద్ద భరోసా- ఒప్పంద వ్యవసాయానికి కేంద్ర చట్టం