గుంటూరు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. వేసవి ఎండలతో అల్లాడిన జిల్లా ప్రజలను సోమవారం సాయంత్రం వచ్చిన గాలివాన ఉక్కిరిబిక్కిరి చేసింది. వాతావరణంతో ఒక్కసారిగా మార్పువచ్చి పలుచోట్ల మాదిరి వర్షాల నుంచి భారీవర్షాలు కురిశాయి. ప్రధానంగా గుంటూరు-బాపట్ల-చీరాల ప్రధాన రహదారిపై పొన్నూరు మండలం కట్టెంపూడి, చేబ్రోలు వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్టు కొమ్మలు విద్యుత్ స్తంభాలపై పడి.. కొన్ని గంటలపాటు సరఫరా నిలిచిపోయింది. అధికారులు అతికష్టం మీద రాకపోకలను పునరుద్దరించగలిగారు. చేబ్రోలులో లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరింది. ఈపూరు మండలం ఊడిజర్లలో గాలివానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రైతులు ఇంటికి తెచ్చిన ధాన్యం వర్షం ధాటికి తడిసి ముద్దయ్యాయి. తెనాలిలో విద్యుత్ సబ్ స్టేషన్ లో సాంకేతిక సమస్య తలెత్తి కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుంటూరు, మంగళగిరి, రాజధాని ప్రాంతాల తోపాటు జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లోనూ గాలివాన జనజీవనాన్ని స్తంభించజేసింది.
ఇది కూడా చదవండి.