మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో కోడెల పార్థివదేహాన్ని సందర్శకుల దర్శనార్థం ఉంచారు. అనంతరం తెదేపా కార్యాలయం నుంచి కోడెల అంతిమయాత్ర ప్రారంభమై... పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి వరకు కొనసాగింది. సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు కోడెల పార్థివదేహాన్ని తరలించారు. నేడు నరసరావుపేటలో ఉదయం 11 నుంచి కోడెల అంతిమయాత్ర మెుదలవుతుంది. పట్టణం సమీపంలోని హిందు శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెెదేపా అధినేత చంద్రబాబు హాజరవుతారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
భారీ బందోబస్తు
కోడెల అంత్యక్రియలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నరసరావుపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 700 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దహన సంస్కరాలకు హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :