గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై... ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరుమాళ్లపల్లి నరసింహారావు, శ్రీనివాసరావు అనే వ్యక్తుల నుంచి సత్తెనపల్లికి చెందిన పొత్తులూరి దాస్, చంద్రవర్మ.. ఎయిమ్స్‌లో ప్రమోటర్స్‌గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రూ. 5 లక్షలు తీసుకున్నారు.
నియామక పత్రాలను సైతం ఇచ్చారు. వాటిని తీసుకొని ఎయిమ్స్ వెళ్లిన నరసింహారావు, శ్రీనివాసరావు.. అధికారులు ఇచ్చిన స్పందనతో ఖంగు తిన్నారు. అవి నకిలీ నియామక పత్రాలని అధికారులు వీరికి చెప్పారు. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు.. ఎయిమ్స్ అధికారులతో కలిసి మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: