న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి విసిరిన వలలో.. పలువురు నిరుద్యోగులు చిక్కుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 26 మంది యువకుల నుంచి రెండున్నర లక్షల రూపాయల చొప్పున వసూలు చేసిన శ్రీకాంత్ రెడ్డి హఠాత్తుగా మకాం మార్చేశాడు. ఫోనుకు సైతం శ్రీకాంత్ రెడ్డి స్పందించకపోవడంతో అనుమానం కలిగింది. సదరు వ్యక్తి సమాచారం తెలుసుకునేందుకు అభ్యర్థులు గుంటూరుకు చేరుకోగా మోసపోయామనే విషయాన్ని గ్రహించారు. జరిగిన మోసంపై గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. కివీ ఫ్రూట్ కంపెనీలో ఫీల్డ్ వర్కర్ గా ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. అతని మాటలు నమ్మి అప్పులు చేసి రెండున్నర లక్షల చొప్పున తన ఖాతాలో వేశామని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గతంలో తమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని విదేశాలకు పంపించటంతో తమకు అతనిపై నమ్మకం ఏర్పడిందని అందుకే డబ్బులు కట్టామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యూజిలాండ్‌లో ఉద్యోగాలంటూ మోసం..డబ్బుతో ఉడాయింపు - Fraud in the name of jobs in newzland
రాష్ట్రం దాటి పక్క రాష్ట్రంలోనే ఉద్యోగం చేస్తున్నామంటేనే అదేదో గౌరవంగా భావిస్తారు. అలాంటిది విదేశాల్లో ఉద్యోగమంటే ఆశపడని వారంటూ ఉండరు. అలాంటి ఆశే చూపాడు గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 26 మంది యువకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోసపోయిన అభ్యర్థులు గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి విసిరిన వలలో.. పలువురు నిరుద్యోగులు చిక్కుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 26 మంది యువకుల నుంచి రెండున్నర లక్షల రూపాయల చొప్పున వసూలు చేసిన శ్రీకాంత్ రెడ్డి హఠాత్తుగా మకాం మార్చేశాడు. ఫోనుకు సైతం శ్రీకాంత్ రెడ్డి స్పందించకపోవడంతో అనుమానం కలిగింది. సదరు వ్యక్తి సమాచారం తెలుసుకునేందుకు అభ్యర్థులు గుంటూరుకు చేరుకోగా మోసపోయామనే విషయాన్ని గ్రహించారు. జరిగిన మోసంపై గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. కివీ ఫ్రూట్ కంపెనీలో ఫీల్డ్ వర్కర్ గా ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. అతని మాటలు నమ్మి అప్పులు చేసి రెండున్నర లక్షల చొప్పున తన ఖాతాలో వేశామని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గతంలో తమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని విదేశాలకు పంపించటంతో తమకు అతనిపై నమ్మకం ఏర్పడిందని అందుకే డబ్బులు కట్టామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Body:arun
Conclusion:8008574467