గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత సహకార సొసైటీలో జరిగిన అక్రమాలపై పోలీసులకు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి చేనేత కాలనీలోని ద మంగళగిరి వీవర్స్ కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్లో జరిగిన అక్రమాలపై చేనేత శాఖ విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు సొసైటీ ఆధీనంలో ఉన్న భూమిని అనుమతి లేకుండా విక్రయాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరిపి భూ అక్రమాలకు పాల్పడ్డ 17 మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.