ETV Bharat / state

తెలంగాణలో డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

author img

By

Published : Oct 30, 2019, 8:33 PM IST

తెలంగాణ మంచిర్యాలలో ఓ కుటుంబాన్ని డెంగీ మహమ్మారి పట్టి పీడిస్తోంది. కేవలం రెండువారాల వ్యవధిలో ఏకంగా నలుగురిని పొట్టన పెట్టుకుంది.

తెలంగాణలో డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో డెంగీతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన మరువకముందే ఆదే కుటుంబానికి చెందిన మరో మహిళ సోనా ఇవాళ ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో డెంగీతో పోరాడి ఓడిపోయారు. రెండు వారాల్లోనే నలుగురు కుటుంబ సభ్యులు మరణించడం అందరినీ కలచివేసింది. నిన్న మధ్యాహ్నమే సోనా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. బిడ్డను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంచిర్యాలలోని శ్రీశ్రీనగర్​ నివాసముంటున్న గట్టు రాజు డెంగీతో ఈనెల 15న మరణించారు. ఆయన మరణించిన ఐదో రోజునే రాజు తాతయ్య లింగయ్య డెంగీ బారిన పడి తుదిశ్వాస విడిచారు. రాజు- సోనాల ఐదేళ్ల కుమార్తె శ్రీ వైష్ణవి కూడా డెంగీ మహమ్మారి సోకి దీపావళి రోజున ప్రాణాలు విడిచింది. ఇవాళ సోనా కూడా మరణించారు. ఇలా ఈ కుటుంబంలో నలుగురిని డెంగీ మింగేసింది.

తెలంగాణలో డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఇవీచూడండి: ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన పోస్ట్​మాస్టర్​ అరెస్ట్​

Intro:సికింద్రాబాద్

యాంకర్: పక్షం రోజుల్లో డెంగ్యూ తో తాత, భర్త, కుమార్తెతో పాటు తను కూడా డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ తనువు చాలించిన ఘటన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో జరిగింది.

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల లో ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంఘటన మరువకముందే మరో కుటుంబ సభ్యురాలు కూడా చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి, ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ వ్యాధి బారిన పడి మరణించిన ఘటన అందరిని కలచివేసింది, మంచిర్యాల టౌన్ శ్రీశ్రీ నగర్ కు చెందిన ఈద సోనా(29) అనే వివాహిత డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయిన సోనా నిన్న మద్యాహ్నం మగశిశువుకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు, గత నాలుగు రోజుల క్రితం దీపావళి రోజున సోనా కూతురు ఐదేళ్ల చిన్నారి శ్రీ వైష్ణవి కూడా డెంగ్యూ తో మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది, సోనా భర్త రాజ గట్టు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ డెంగ్యూ బారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గత పదిహేను రోజుల క్రితమే చనిపోయాడు. మృతుడి 5వ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రాజ గట్టు తాత లింగయ్య కూడా డెంగ్యూ తో మరణించాడు. సోనా 9 నెలల గర్భవతి ఆమె మూడు రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది, నిన్న మగ పిల్లోడికి జన్మ నిచ్చిన సోనా ఈరోజు మధ్యహ్నం చనిపోయింది. ఇప్పటికే భర్త, తాత మరియు కుమార్తెను పోగొట్టుకున్న సోనా కూడ మృతి చెందింది, ఒకే కుటుంబంలో డెంగ్యూతో నలుగురు చనిపోవడంతో మంచిర్యాల ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరు డెంగ్యూ వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బైట్: శ్రీహిత,
మృతురాలి సోదరిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.