విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా భారత్ బంద్కు తెదేపా పూర్తి మద్దతు పలుకుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర తెలిపారు. తెనాలి పట్టణంలో పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీలు నిర్వహించి భారత్ బంద్కు మద్దతు పలికారు. ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనికి పొంతన లేదని ఆరోపించారు. అధికారం రాకముందు ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చి.. ఇప్పుడు దానిని పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి దిల్లీలో ఒక మాట.. రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతూ పేద ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్షల కోట్ల ఆస్తి విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం.. జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైందన్నారు. రైతులకు నష్టం చేసే ప్రభుత్వ తీరుకు నిరసనగా భారత్ బంద్కు తాము సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. మరోవైపు సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం చేశారు.
ఇవీ చదవండి