డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. గుంటూరులో దళిత సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సుధాకర్ కేసు సీబీఐకు ఇవ్వడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 64 విషయాలలో హైకోర్టు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిందన్నారు. హైకోర్టు తప్పుబట్టిన అంశాలకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులను పరామర్శించిన సీఎం జగన్.. ప్రకాశం జిల్లాలో దళితులు చనిపోతే ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పరిహారంలో కూడా దళితులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని హితువు పలికారు.
ఇదీచూడండి. గుంటూరులో భగ్గుమంటున్న ఎండలు