ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిని రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను, కష్టాలు తీరుస్తానన్న సీఎం జగన్... అధికారంలోకి వచ్చాక ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం ఎలా చేయాలో అధ్యయనం చేసినట్లుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు రాజధాని మార్చొద్దంటూ నినదిస్తుంటే... అందుకు పోటీగా ప్రదర్శనలు, సభలు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగించాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే చరిత్ర హీనులుగా మిగులుతారని హితవు పలికారు.
ఇదీ చదవండి: 50వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు