Devineni Uma Comments On Jagan : అప్పుల కోసం ఖర్చు తగ్గించే నిబంధనతో ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులను వైఎస్సాసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలకే దిక్కులేదని ఆయన పేర్కొన్నారు. బడుల్లో టీచర్లు లేకుండా రంగులు వేస్తేనో బడి గోడలపై బొమ్మలు వేస్తేనో పిల్లలకు చదువు వస్తుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీలుగా కనిపించిన 23 వేల పోస్టులు అధికారంలోకి రాగానే మాయమయ్యాయని ఆక్షేపించారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. మెగా డీఎస్సీ వేస్తాను అంటూ నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆయన అన్నారు.
-
అప్పుల కోసం ఖర్చు తగ్గించే నిబంధనతో ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల రద్దు చేసిన సర్కార్. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలకే దిక్కు లేదు. బడుల్లో టీచర్లు లేకుండా రంగులు వేస్తేనో బడి గోడలపై బొమ్మలు వేస్తేనో పిల్లలకి చదువు వస్తుందా ? ప్రతిపక్షంలో ఖాళీలుగా (1/2) pic.twitter.com/aDtIqGlyOS
— Devineni Uma (@DevineniUma) April 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">అప్పుల కోసం ఖర్చు తగ్గించే నిబంధనతో ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల రద్దు చేసిన సర్కార్. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలకే దిక్కు లేదు. బడుల్లో టీచర్లు లేకుండా రంగులు వేస్తేనో బడి గోడలపై బొమ్మలు వేస్తేనో పిల్లలకి చదువు వస్తుందా ? ప్రతిపక్షంలో ఖాళీలుగా (1/2) pic.twitter.com/aDtIqGlyOS
— Devineni Uma (@DevineniUma) April 5, 2023అప్పుల కోసం ఖర్చు తగ్గించే నిబంధనతో ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల రద్దు చేసిన సర్కార్. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలకే దిక్కు లేదు. బడుల్లో టీచర్లు లేకుండా రంగులు వేస్తేనో బడి గోడలపై బొమ్మలు వేస్తేనో పిల్లలకి చదువు వస్తుందా ? ప్రతిపక్షంలో ఖాళీలుగా (1/2) pic.twitter.com/aDtIqGlyOS
— Devineni Uma (@DevineniUma) April 5, 2023
సీఎం అవినీతిని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దోపిడీ విధానం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కొనసాగిస్తున్నాడని గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నూరు మున్సిపాలిటీ కమిషనర్‌తో సహా పలువురు ఇంజనీరింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
14, 15 ఆర్థిక సంఘం నిధులు గుత్తేదారులకు దోచిపెడుతున్నారని, దీని కోసం 2020 సంవత్సరంలో అనుమతి పొందిన పనులను వ్యయాలు పెంచి 2023లో పనులు నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాల కంటే ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాల కోసం నిధులు దోచేస్తున్నారని ప్రతి సచివాలయం నిర్మాణంలో ప్రభుత్వం 20 లక్షల నగదు మంజూరు చేసిందని, నియోజకవర్గంలో పక్కా భవనాల స్థానంలో రేకుల షెడ్లు నిర్మించి కూడా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.
ఇసుక స్థానంలో డస్ట్ : గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మాణాల్లో ఇసుక స్థానంలో డస్ట్ వాడుతున్నారని, నిర్మాణంలో ఉన్న ప్రాంతాలకు ఆయా శాఖల అధికారులను పంపి బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ నిర్వహించాలని, లేనిపక్షంలో పోరాటానికి సిద్ధంగా ఇన్నామని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు
"ప్రజల అవసరాల కంటే తాము ఎలా సొమ్ము చేసుకోవచ్చు అనే దాని మీదనే పనుల కేటాయింపు జరుగుతోంది. ప్రతి సచివాలయ నిర్మాణానికి 20 లక్షల డబ్బులు ఇచ్చారు. మన పొన్నూరులోనే ఏ ఊరు వెళ్లినా కాంక్రీట్ బిల్డింగ్ ఉంటుంది. దాన్ని మార్చేసి పైన రేకులు వేసి లెవల్ చేయడానికి కొంత డబ్బు, రోడ్లు వేయడానికి కొంత డబ్బులని, అలాగని పనులేమైనా నాణ్యతగా జరిగాయా అంటే పనులు నాణ్యతగా జరిగిన సందర్భమే లేదు. ఫిర్యాదు చేసి నాలుగు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఎంక్వైరీ లేదు. " - ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, టీడీపీ నేత
ఇవీ చదవండి