గుంటూరు జిల్లా చర్లగుడిపాడు చెరువులో కొన్ని రోజులుగా సంచరిస్తున్న మొసలిని అటవీశాఖ అధికారులు వలలు వేసి పట్టుకున్నారు. స్థానిక యువకుల సాయంతో రెండు రోజులు శ్రమించి మొసలిని బంధించారు.
గ్రామస్తుల ఫిర్యాదుతో మొసలిని బంధించిన అటవీశాఖ అధికారులు దాన్ని అటవీ ప్రాంతానికి తరలించారు. మొసలి భయం వీడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి