అధిక వర్షాలు మత్స్య పరిశమ్రకు ఎంతో మేలు చేశాయి. వరద నీరు భారీఎత్తున సముద్రంలోకి చేరడంతో చేపలు వృద్ధి చెందాయని, ఆ కారణంగానే వేట ఆశాజనకంగా ఉందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం హార్బరులో రెండు వందల బోట్లు, మరో ఐదు వందలు ఫైబర్, 600 వరకు నాటు పడవలు ఉన్నాయి. మత్స్యపరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మందిపైనే ఉపాధి పొందుతున్నారు. వరదలు, వాయుగుండాలు వచ్చిన సందర్భంలో చేపల వేట అనుకూలంగానే ఉంటుంది. వర్షాలు పడిన అనంతరం వరద నీరు సముద్రంలో కలవడంతో ఉప్పు, మంచి నీరు కలిసే క్రమంలో మత్స్య సంపదలు బాగా పెరుగుతాయి.
వాయుగుండాల సమయంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో వాటి తాకిడికి రొయ్యలు, చేపలు తీర ప్రాంతానికి చేరి మత్స్యకారుల వలకు చిక్కుతాయి. ఏటా ఈ సీజనులో నల్ల, తెల్ల చుక్కలు, చౌడాయి రకాలు, సముద్రానికి సమీప కాల్వలో అయితే మేవ చేపలు అధికంగా పడతాయి. వీటిలో చందువాలకు మంచి ధరలు వస్తాయి. పరిమాణం బట్టి కేజీ రూ.800 పలుకుతాయి. కలంద, నారన్, టైగర్ రొయ్యలు అధికంగా పడతాయి. ప్రస్తుతం తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని మత్స్యకార్మికుడు సుబ్బారావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షపాతం భారీగా నమోదుకావడంతో బాగా వృద్ధి చెందిందని నిజాంపట్నం మత్స్య అభివృద్ధి అధికారి హెన్రీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: