ETV Bharat / state

ఊహించని వరదతో ఉపాధికి దూరం - guntur

కృష్ణా నదిలో వరద కొనసాగుతుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వేటకు వెళ్తే తప్ప కుటుంబపోషణ జరగని పరిస్థితుల్లో... వరద ఎప్పుడు తగ్గుతుందోనని ఎదురుచూస్తున్నారు.

చేపల వేట
author img

By

Published : Aug 17, 2019, 9:59 AM IST

ఊహించని వరదతో ఉపాధికి దూరం

కొత్త నీరు వచ్చిందంటే చాలు.. చేతినిండా పని, ఆదాయం ఉండే మత్స్యకారులు ఇప్పుడు ఊహించని వరదతో ఉపాధికి దూరమయ్యారు. కృష్ణానదిలో వరద తీవ్రత కారణంగా నాటుపడవలతో వేటకు సాహసించడంలేదు. కృష్ణా జిల్లా ఫెర్రీ నుంచి భారీ మర పడవ నీటి ఉదృతికి కొట్టుకుని ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి దిగువకు వెళ్లిపోవటంతో.. చిన్న చిన్న ఫైబర్‌ బోట్లతో చేపల వేట సాగించడం ప్రమాదమని మత్స్యకారులు భావిస్తున్నారు. ఐదు రోజుల నుంచి వేట నిలిపివేసి ఒడ్డునే నీటి ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందోనని ఎదురుచూస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని ఆనుకుని వేట సాగించే మత్స్యకారుల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాసమోహన్‌ మరిన్ని వివరాలు అందిస్తారు.

ఇది కూడా చదవండి.

వరద నీటిలో శ్మశానం... ఖననానికి నోచుకోని మృతదేహం

Intro:సోమశిల విసిట్Body:యాంకర్ వాయిస్: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయాన్ని కేంద్ర జలాల జలాశయాల పరిరక్షణ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ జలాశయం మట్టి కట్టడం, వాక్ వే బ్రిడ్జి, తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆపరా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పెట్టిన వరద రక్షణ పనుల గురించి ఈఈ సురేష్ బాబును ఆరా తీశారు. ఈఈ సురేష్ బాబు మాట్లాడుతూ శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు సోమశిల జలాశయానికి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు 5,800 క్యూసెక్కులు నీరు చేరిందని ఈ ప్రవాహం ఇంకా మరో నెల రోజుల పాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.