గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణంలోని హైస్కూల్లో కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తి పది రోజుల క్రితం అనారోగ్యానికి గురై... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. అధికారులు ఆ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతంలో శానిటైజ్ చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: జిల్లాలో 818కు చేరిన కరోనా కేసులు !