గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ దంపతులు చిన్నచిన్న పెట్రోల్ బాటిళ్లు అమ్ముకొని జీవనం సాగించేవారు. ప్రమాదవశాత్తు ఆ బాటిళ్లకు నిప్పంటుకుని అగ్ని ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వారిని గుంటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మహిళ మృతిచెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ఎలా జరిగిందనే ఈ విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండీ... కరోనా అప్ డేట్స్ : జిల్లాలో కొత్తగా 496 కేసులు...4 మరణాలు